శ్రీనివాసుడి చిత్రపటానికి ముగ్ధుడైన బ్రహ్మానందం.. చిత్రకారుడికి స్వర్ణ కంకణంతో సన్మానం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ్రీనివాసుడి చిత్రపటానికి ముగ్ధుడైన బ్రహ్మానందం.. చిత్రకారుడికి స్వర్ణ కంకణంతో సన్మానం

ఒక వారపత్రికపై ఏడుకొండల వాడి అద్భుత ముఖ చిత్రాన్ని చూసి ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ముగ్ధుడైపోయాడు. ఆ చిత్రం గీసిన చిత్రకారుడు బీకేఎస్ శర్మ ప్రతిభను ఆయన ఫోన్ చేసీ మరీ అభినందించాడు. అంతటితో ఆగని బ్రహ్మానందం, అదే మాదిరి తైలవర్ణ చిత్రాన్ని తన నివాసంలో పెట్టుకోవడానికి గీసివ్వాలని కోరాడు. ఆ తైలవర్ణ చిత్రాన్ని గీసి ఇచ్చిన శర్మను అభినందించడంతో పాటు ఆయనకు స్వర్ణ కంకణం తొడిగి మరీ సత్కరించారు. తెలుగు చలన చిత్ర రంగంలో తనదైన హాస్యంతో తిరుగులేకుండా కొనసాగుతున్న బ్రహ్మానందానికి తిరుమల శ్రీనివాసుడంటే అమితమైన భక్తి. తన నటనా జీవితంలో ఎన్నో సన్మానాలు, సత్కారాలు పొందిన బ్రహ్మానందం ఒక చిత్ర కారుడి ప్రతిభను గుర్తించి ఈ విధంగా సత్కరించడం విశేషం.

More Telugu News