తెలంగాణ ప్రభుత్వానికి భారీ షాక్.. భూసేకరణ జీవో 123 కొట్టివేత.. 2013 చట్టమే ఉపయోగించాలని హైకోర్టు ఆదేశం
తెలంగాణ ప్రభుత్వానికి ఈరోజు హైకోర్టులో భారీ షాక్ తగిలింది. భూసేకరణ జీవో 123ను హైకోర్టు కొట్టివేసింది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా 123 జీవో ప్రకారం ప్రభుత్వం నేరుగా భూములను సేకరిస్తోందంటూ, దీని వల్ల తమకు అన్యాయం జరుగుతోందంటూ మెదక్ జిల్లా భూనిర్వాసితులు హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషనర్లతో ఏకీభవించిన హైకోర్టు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే రైతుల నుంచి భూసేకరణ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 123 జీవోతో పాటు 124 జీవోను కూడా కొట్టి వేసింది. 2013 చట్టాన్ని ఉపయోగించకుండానే ప్రాజెక్టులు మొదలు పెడదామనుకున్న తెలంగాణ సర్కార్‌కి హైకోర్టు తీర్పు పెద్ద దెబ్బే.