కాంగ్రెస్ పార్టీ కుయుక్తితో బిల్లు పెట్టినప్పటికీ, మేం పూర్తి మద్దతిస్తాం: తోట నరసింహం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ పార్టీ కుయుక్తితో బిల్లు పెట్టినప్పటికీ, మేం పూర్తి మద్దతిస్తాం: తోట నరసింహం

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు పూర్తి మద్దతిస్తామని ఎంపీ తోట నరసింహం తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ కుయుక్తితో ఏపీకి ప్రత్యేకహోదాపై ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టినప్పటికీ... తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తెలుగు ప్రజల ప్రయోజనాలే తమ మొదటి ప్రాధాన్యమని చెప్పిన ఆయన, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిందే కాకుండా, లేనిపోని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ చిత్తశుద్ధిని శంకించే స్థాయి కాంగ్రెస్ నేతలకు లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన సూచించారు. నిజాయతీగా ప్రజల ముందుకు రావాలని ఆయన సూచించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తమకు శత్రువైనప్పటికీ, ప్రతిపక్షాలైనా సరే కలిసి పనిచేస్తామని ఆయన తెలిపారు.

More Telugu News