ఇంకా నిండని తుంగభద్ర, జూరాల జలాశయాలు... శ్రీశైలానికి తరలని కృష్ణమ్మ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇంకా నిండని తుంగభద్ర, జూరాల జలాశయాలు... శ్రీశైలానికి తరలని కృష్ణమ్మ!

రాయలసీమ ప్రాంతానికి నీరందించే వరప్రదాయిని శ్రీశైలం జలాశయానికి ఇంకా వరదనీరు రావడం లేదు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆల్మట్టితో పాటు, నారాయణపూర్ రిజర్వాయర్లు నిండుకుండగా మారగా, ఆపై వచ్చిన నీరంతటినీ కిందకే విడుదల చేస్తున్నారు. వరదనీరు జూరాల ప్రాజెక్టుకు చేరుతోంది. ఈ మధ్యాహ్నానికి జూరాల నిండుతుందని అధికారుల అంచనా. మరోవైపు తుంగభద్ర డ్యామ్ కు కూడా పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. తుంగభద్ర జలాశయం నిండాలంటే మరో 5 టీఎంసీల నీరు అవసరం. నేటి సాయంత్రానికి అది కూడా చేరుతుందని భావిస్తున్నారు. ఆ తరువాత మాత్రమే శ్రీశైలానికి వరద నీరు విడుదల ప్రారంభమవుతుంది. ప్రస్తుతం తుంగభద్రకు 8,705 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరుతోంది. వరదనీటికి శ్రీశైలం డ్యామ్ కు మధ్య జూరాల, తుంగభద్ర రిజర్వాయర్లు ఉన్నాయి. ఇవి నిండి శ్రీశైలంకు నీటిని వదిలినా అది స్వల్పంగానే ఉండవచ్చని అంచనా. గత నాలుగైదు రోజులుగా కర్ణాటక ప్రాంతంలో చెప్పుకోతగ్గ వానలు లేవు. అంటే, శ్రీశైలం పూర్తిగా నిండి, ఆపై నాగార్జున సాగర్ కు వాటర్ రావాలంటే, మరోసారి భారీ వర్షాలు కురవక తప్పదు.

More Telugu News