‘అనంత’లో వేటకొడవళ్ల స్వైరవిహారం!... ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి దారుణ హత్య!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

‘అనంత’లో వేటకొడవళ్ల స్వైరవిహారం!... ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి దారుణ హత్య!

ఫ్యాక్షన్ హత్యలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అనంతపురం జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది. ప్రత్యర్థులు జరిపిన దాడిలో చంద్రశేఖరరెడ్డి అనే వ్యక్తి నడిరోడ్డుపైనే ప్రాణాలు వదిలాడు. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన నిన్న రాత్రి ఆ జిల్లాలోని బత్తలపల్లి మండలం మాల్యవంతంలో చోటుచేసుకుంది. ఒంటరిగా వెళుతున్న చంద్రశేఖరరెడ్డిపై ఆయన ప్రత్యర్థులు విరుచుకుపడ్డారు. వేటకొడవళ్లతో ఆయనను ఇష్టారాజ్యంగా నరికేశారు. ఈ దాడిలో చంద్రశేఖరరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.

More Telugu News