Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వచ్చే నెల 6న విశాఖకు రాహుల్: డిగ్గీ రాజా ప్రకటన

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వచ్చే నెల 6న ఏపీ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు నేటి ఉదయం విశాఖకు వచ్చిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్... విశాఖలో రాహుల్ పర్యటనకు సంబంధించి ప్రకటన చేశారు. విశాఖ జిల్లాలోని చింతపల్లిలో పర్యటించనున్న రాహుల్ గాంధీ... అటవీ హక్కుల చట్టం అమలు తీరును పరిశీలించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అటవీ హక్కుల చట్టం మేరకు గిరిజనులకు ఏ మేరకు న్యాయం జరుగుతోంది?... లేని పక్షంలో చట్టానికి ఎలాంటి మార్పుల కోసం ఉద్యమించాలన్న కోణంలో రాహుల్ పర్యటన సాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

More Telugu News