కుంబ్లే నుంచి నేర్చుకున్న తొలి పాఠం ఇదే!: ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కుంబ్లే నుంచి నేర్చుకున్న తొలి పాఠం ఇదే!: ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ

సానుకూల ధోరణిలో ఉండాలన్నదే టీమిండియా హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే నుంచి తాను నేర్చుకున్న తొలిపాఠమని ఆల్ రౌండర్ బిన్నీ పేర్కొన్నాడు. సాంకేతిక పరమైన అంశాలేవీ కుంబ్లే ఇంకా తమకు చెప్పలేదని అన్నాడు. టీమిండియా హెడ్ కోచ్ గా కుంబ్లే నియమితులవడంపై బిన్నీ స్వాగతించాడు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియా ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటోందని చెప్పాడు. అనిల్ కుంబ్లే, టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి లిద్దరూ కోరుకునేది ఒకటేనని.. టీమిండియా జట్టు విజయపథంలో నడవాలనే వారు కోరుకుంటారని స్టువర్ట్ బిన్నీ అభిప్రాయపడ్డాడు.

More Telugu News