సంగక్కర డ్రీమ్ టీమ్ ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సంగక్కర డ్రీమ్ టీమ్ ఇదే!

న్యూజిలాండ్ మాజీ ఆటగాడు బ్రెండన్ మెక్ కల్లమ్ కలల జట్టును ప్రకటించి 24 గంటలు ముగియకుండానే శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర తన డ్రీమ్ టీమ్ ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా దిగ్గజం సచిన్ కు స్థానం కల్పించకపోవడం విశేషం. అదే సమయంలో మరో దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ను ఎంచుకున్నాడు. ఈ మేరకు 11 మంది ఆటగాళ్లతో కూడిన డ్రీమ్ టీమ్ ను వెల్లడించాడు. ఈ జట్టులో సొంత జట్టు నుంచి ముగ్గురుకి చోటు కల్పించాడు. శ్రీలంక ఆల్ టైమ్ గ్రేట్ అరవింద్ డిసిల్వా, ముత్తయ్య మురళీధరన్, చమిందావాస్ లకు స్థానం కల్పించాడు. ఆస్ట్రేలియా జట్టు నుంచి రికీ పాంటింగ్‌, మాథ్యూ హేడెన్, ఆడమ్ గిల్ క్రిస్ట్, షేన్ వార్న్ ను ఎంపిక చేశాడు. విండీస్ దిగ్గజం బ్రియాన్ లారాతో పాటు, టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్, ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్ సౌతాఫ్రికా మాజీ ఆటగాడు జాక్వెస్ కలిస్, పాకిస్థాన్ దిగ్గజం వసీం అక్రంలను తన డ్రీమ్ టీమ్ కు ఎంపిక చేశాడు.

More Telugu News