పెద‌బాబు చంద్ర‌బాబు, చినబాబు లోకేశ్ కలసి ఏపీని దోచేస్తున్నారు: రోజా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద‌బాబు చంద్ర‌బాబు, చినబాబు లోకేశ్ కలసి ఏపీని దోచేస్తున్నారు: రోజా

బినామీల పేరుతో రాజధాని నిర్మాణం నుంచి అన్ని అంశాల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు దోచుకుంటున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత రోజా ఆరోపించారు. ఈరోజు హైద‌రాబాద్‌లోని వైసీపీ కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ‘పెదబాబు చంద్రబాబు, చినబాబు లోకేశ్ బాబు బినామీ పేర్లతో రాజధాని భూములను దోచుకుంటున్నారు. చంద్రబాబుది తెలుగు దేశం పార్టీ కాదు.. తెలుగు దొంగల పార్టీ..’ అని ఆమె వ్యాఖ్యానించారు. ‘తెలుగోడి ఆత్మగౌరవాన్ని చంద్రబాబు ప్రభుత్వం సింగ‌పూర్‌కి తాకట్టు పెడుతోంది’ అని ఆమె అన్నారు. మ‌రోవైపు టీడీపీ ప్ర‌భుత్వం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జాప్ర‌యోజ‌నాల‌పై కేంద్రంతో పోరాడే స్థితిలో లేద‌ని ఆమె అన్నారు. మన రైతులు, మన ప్రజలు అన్న భావ‌మే చంద్ర‌బాబు స‌ర్కారుకి లేద‌ని ఆమె వ్యాఖ్యానించారు. సింగపూర్ కంపెనీలకు భూములను కట్టబెట్టి వ్యక్తిగతంగా ప్రయోజనాలు ఆశిస్తూ చంద్రబాబు స్కెచ్ వేశారని రోజా ఆరోపించారు. ‘రైతుల భూమిని సింగపూరోడికిచ్చి వారి చేతిలో ప్రజల భవిష్యత్తుని పెడుతున్నారు. ఏపీ భూముల్ని తెల్లదొరల చేతుల్లో పెడుతున్నారు. చంద్రబాబు సీఎం ఆంధ్రప్ర‌దేశ్‌కా..? సింగ‌పూర్‌కా..? ఇది ప్ర‌జ‌ల భ‌విష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తు.. త‌న సొంత ప్ర‌యోజ‌నాల కోసం చంద్ర‌బాబు అప్ప‌నంగా సింగ‌పూర్ కి ప్ర‌జ‌ల భ‌విష్యత్తుని తాక‌ట్టుపెడుతున్నారు. భూముల్ని అడ్డ‌గోలుగా దోచేస్తున్నారు. విదేశాలకు ప్ర‌జ‌లు బానిస‌ల‌వుతారు’ అని రోజా ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

More Telugu News