అసలు నాతో సమస్యేంటో గంగూలీని అడగండి: రవిశాస్త్రి

28-06-2016 Tue 11:26 | Sports
టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టాలని భావించి, అనిల్ కుంబ్లేతో పోటీపడి ఓడిపోయిన మాజీ టీం డైరెక్టర్ రవి శాస్త్రి, కోచ్ ని ఎంపిక చేసిన విధానమే తనకు నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నాడు. ఓ దినపత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, తాను గత 18 నెలలుగా ఓ కలను సాకారం చేసుకునేందుకు ఎంతో కృషి చేస్తూ వచ్చానని, తదుపరి మూడేళ్లలో ఎంతో సాధించాలని ప్రణాళికలు వేశానని చెప్పారు. ఓ టాలెంటెడ్ టీమ్ ను సృష్టించిన వేళ, తనను దూరం పెట్టారని చెప్పారు. అనిల్ కుంబ్లేను ఎంపిక చేయాలని ముందే నిర్ణయించుకున్నట్టు భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు దానికి సమాధానం చెప్పాల్సింది తాను కాదని అన్నాడు. తనతో ఉన్న సమస్యేంటో సౌరవ్ గంగూలీనే అడిగి తెలుసుకోవాలని చెప్పాడు. తన బాధ్యత ఇంటర్వ్యూకు హాజరవడమేనని, ఆపై వెనకాల ఏం జరిగిందో తనకు తెలియదని చెప్పాడు. కాగా, తన ఇంటర్వ్యూ సమయంలో గంగూలీ అసలు లేనే లేడని రవిశాస్త్రి ఇప్పటికే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గంగూలీయే తనను అడ్డుకున్నాడని కూడా రవిశాస్త్రి ఆరోపించాడు. ఇంటర్వ్యూలో ఏం అడిగారని ప్రశ్నిస్తే, తానేమీ సీఈఓ పోస్టుకు దరఖాస్తు చేయలేదని, సచిన్, సంజయ్ జగ్దాలే, వీవీఎస్ లక్ష్మణ్ లతో భారత క్రికెట్ భవిష్యత్ గురించి ఎంతో చర్చించానని, తాను టీమ్ డైరెక్టరుగా ఉన్న సమయంలో కొన్ని విషయాలను గుర్తు చేశానని తెలిపాడు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ మంచి ఆటతీరు చూపిందని వెల్లడించినట్టు పేర్కొన్నాడు. విజయం కోసం ఆటగాళ్లు తపిస్తున్నారని వెల్లడించానని. టెస్టు క్రికెట్ లో నెంబర్ వన్ హోదాలో లేకపోవడానికి కారణం ఆరు నెలలుగా ఒక్క మ్యాచ్ కూడా ఆడకపోవడమేనని గుర్తు చేసినట్టు వివరించాడు.

More Telugu News

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30
..more