భానుభక్త రామాయణం ఆంగ్లంలోకి అనువాదం
నేపాలీ భాషలోని భానుభక్త రామాయణం ఆంగ్ల భాషలోకి అనువాదమైంది. ఈ రామాయణాన్ని ఇంతవరకు పలు భాషల్లోకి అనువదించడం జరిగింది. అయితే, ఆంగ్లంలోకి అనువదించేందుకు మాత్రం 200 ఏళ్లు పట్టింది. 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవి భానుభక్త ఆచార్య నేపాలీలో రచించిన రామాయణంను రచయిత గోకుల్ సిన్హా ఆంగ్లంలోకి అనువదించారు. ఈ పుస్తకాన్ని మరో ప్రముఖ రచయిత బహదూర్ రాయ్ నిన్న ఆవిష్కరించారు.