శభాష్... దేవినేని!: ఢిల్లీలో బాగా వాదనలు వినిపించారని భుజం తట్టిన చంద్రబాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శభాష్... దేవినేని!: ఢిల్లీలో బాగా వాదనలు వినిపించారని భుజం తట్టిన చంద్రబాబు!

టీడీపీ సీనియర్ నేత, ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆ పార్టీ అధినేత, సీఎం నారా చంద్రబాబునాయుడు నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. సహచర మంత్రుల సమక్షంలోనే ఆయనను చంద్రబాబు అభినందించారు. కృష్ణా నదీ జలాలపై నెలకొన్న వివాదం పరిష్కారం నిమిత్తం ఇటీవల అధికారులతో కలిసి ఢిల్లీ వెళ్లిన దేవినేని... అక్కడ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి సూచన మేరకు తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావుతోనూ రెండు దఫాలుగా చర్చలు జరిపారు. చర్చలు ఫలించకున్నా దేవినేని తనదైన శైలిలో వాదనలు వినిపించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సందర్భంగానూ తెలంగాణ తొండి వాదంతో ముందుకెళుతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఎదుర్కొంటున్న ఇబ్బందులు జలనవరుల శాఖకు అర్థమయ్యేలా వివరించడంలో దేవినేని సఫలీకృతులయ్యారన్న వాదన లేకపోలేదు. ఈ నేపథ్యంలో నిన్న విజయవాడలో జరిగిన కేబినెట్ భేటీలో భాగంగా ఈ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు... ఢిల్లీలో మంచిగా వాదనలు వినిపించారని దేవినేనిని అభినందించారు. దేవినేనితో పాటు ఢిల్లీ వెళ్లిన జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్సీ వెంకటేశ్వరరావు, అంతర్రాష్ట్ర జలాల పర్యవేక్షణ చీఫ్ ఇంజినీర్ రామకృష్ణను కూడా చంద్రబాబు అభినందించారు.

More Telugu News