కృష్ణా జిల్లాలోనూ వైసీపీ ఖాళీ?... ముగ్గురు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారంటున్న జిల్లా టీడీపీ అధ్యక్షుడు!

23-06-2016 Thu 07:17 | Both States
ఏపీలో అధికార పార్టీ టీడీపీ చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’కు విపక్ష వైసీపీ విలవిల్లాడుతోంది. వైసీపీ టికెట్లపై విజయం సాధించిన 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే ఆ పార్టీని వీడి టీడీపీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారన్న వార్తలు వినవస్తున్నాయి. కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, విశాఖ తదితర జిల్లాల్లో మొన్నటిదాకా కాస్తంత బలంగా కనిపించిన వైసీపీ ప్రస్తుతం బలహీనపడిపోయింది. ఇక పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో టీడీపీ బలం ముందు వైసీపీ ఏమాత్రం తూగలేని పరిస్థితిలో ఉంది. తాజాగా మరో కీలక జిల్లా... కృష్ణా జిల్లాలోనూ వైసీపీ మరింత బలహీనపడే ప్రమాదం లేకపోలేదు. ఈ మేరకు ఆ జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడు నిన్న సంచలన ప్రకటన చేశారు. జిల్లాలోని నూజివీడులో పర్యటించిన సందర్భంగా నిన్న అర్జునుడు సంచలన ప్రకటన చేశారు. జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో నూజివీడు ఎమ్మెల్యే కూడా ఉన్నారని అర్జునుడు వైసీపీకి డేంజర్ బెల్స్ మోగించారు. గడచిన ఎన్నికల్లో వైసీపీకి ఈ జిల్లాలో ఐదు అసెంబ్లీ సీట్లు దక్కాయి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గం నుంచి గెలిచిన జలీల్ ఖాన్ ఇప్పటికే టీడీపీలో చేరిపోయారు. వెరసి ఆ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు నలుగురు మాత్రమే ఉన్నారు. బచ్చుల అర్జునుడు చెప్పిన ప్రకారం ముగ్గురు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే... సింగిల్ ఎమ్మెల్యే మాత్రమే ఆ పార్టీలో ఉంటారు. ఆయన చెబుతున్న దాని ప్రకారం జిల్లాలోని తిరువూరు, నూజివీడు, పామర్రు ఎమ్మెల్యేలుగా ఉన్న రక్షణ నిధి, మేకా ప్రతాప్ అప్పారావు, ఉప్పులేటి కల్పనలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటకే వీరు పలు డిమాండ్లను టీడీపీ ముందు పెట్టారట. ప్రస్తుతం వీటిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడం ఖాయమేనని అర్జునుడు చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే... ప్రస్తుతం జిల్లాలో టీడీపీకి ఎదురొడ్డి పోరు సాగిస్తున్న గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) మాత్రమే వైసీపీకి మిగులుతారు.

More Telugu News

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30
..more