భవిష్యత్తులో నేను కూడా కోచ్ రేసులో ఉండొచ్చు: గంగూలీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భవిష్యత్తులో నేను కూడా కోచ్ రేసులో ఉండొచ్చు: గంగూలీ

భవిష్యత్ లో టీమిండియాకు కోచ్ గా వ్యవహరించాలనే అభిలాషను క్యాబ్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ వ్యక్తం చేశారు. కోల్ కతాలో టీమిండియా కోచ్ ను ఎంపిక చేసే సందర్భంగా మీడియాతో గంగూలీ మాట్లాడుతూ, 20 సంవత్సరాలు దేశానికి ప్రాతినిధ్యం వహించిన తాను, ఇప్పుడు కోచ్ ను సెలెక్ట్ చేసే టీంలో సభ్యుడిగా ఉన్నానని అన్నాడు. 2005-06లో ఇయాన్ ఛాపెల్ టీమిండియా కోచ్ కావడం వెనుక తన హస్తం కూడా ఉందని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. సహచరులు సచిన్, లక్ష్మణ్ తో కలిసి కోచ్ ను ఎంపిక చేసే బాధ్యతను తన భుజాలపై బీసీసీఐ పెట్టిందని తెలిపాడు. ఇవన్నీ తన జీవితంలో చోటుచేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉందని గంగూలీ చెప్పాడు. భవిష్యత్ లో ఏదో ఒకరోజు టీమిండియా కోచ్ రేసులో తాను ఉండవచ్చని అన్నాడు.

More Telugu News