చంద్రబాబు వెంట చైనా వెళుతున్న బృందమిదే!
ఈ నెల 26 నుంచి ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చైనాలో పర్యటించనుండగా, ఆయన వెంట వెళుతున్న బృందం పేర్లను సాధారణ పరిపాలనా శాఖ వెల్లడించింది. మంత్రులు నారాయణ, యనమల, ముఖ్య సలహాదారు పరకాలతో పాటు రాజధాని ప్రాంత అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గణేశ్ బాబు, సీఎం చీఫ్ సెక్రటరీ సాయి ప్రసాద్, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సాల్మన్, సీఎం కార్యదర్శి ప్రధ్యుమ్న, రాజధాని అభివృద్ధి నిర్వహణ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీ పార్థసారధి, ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డు సీఈఓ జాస్తి కృష్ణ కిషోర్, సీఎం వ్యక్తిగత కార్యదర్శి రాజగోపాల్, ముఖ్య భద్రతాధికారి నాగేంద్రుడు సీఎంతో పాటు చైనాకు వెళ్లనున్నారు. వీరి పర్యటనకు సంబంధించిన కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ వచ్చిందని అధికారులు తెలిపారు.