డబ్బు రెట్టింపు కోసం మేం పూజలు చేయలేదు: 'లైఫ్ స్టయిల్' యజమాని తనయుడు సందేశ్ రెడ్డి
తాము బాబా అని నమ్మిన వ్యక్తి తమను మోసం చేస్తాడని ఊహించలేదని లైఫ్ స్టయిల్ బిల్డింగ్ యజమాని ముధుసూదన్ రెడ్డి కుమారుడు సందేశ్ రెడ్డి ఈరోజు మీడియాకి తెలిపాడు. ఇప్పుడు తమ కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన పేర్కొన్నాడు. తమ ఇంట్లో పూజలు నిర్వహించిన శివని నిజమైన బాబాగానే తాము నమ్మామని ఆయన అన్నాడు. ‘డబ్బురెట్టింపు కోసం తాము పూజలు చేయలేదు’ అని ఆయన పేర్కొన్నాడు.
పూజల పేరుతో ముధుసూదన్ రెడ్డి నుంచి కోటీ 30 లక్షల రూపాయలు కాజేసిన కేసులో ప్రధాన నిందితుడు శివానందబాబాను బెంగళూరు సమీపంలో టాస్క్ ఫోర్స్ అరెస్టు చేసింది. శివపై ఐపీసీ 307,420,379 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.