కేంద్రం చేస్తోన్న అభివృద్ధిపై నిజాలు తెలుసుకుని మాట్లాడు!: కేటీఆర్‌కు దత్తాత్రేయ సూచన
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన అభివృద్ధి పనులను కేటీఆర్ విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని ఆయన అన్నారు. కేంద్రం చేస్తోన్న అభివృద్ధిపై నిజాలు తెలుసుకోవాలని ఆయన కేటీఆర్‌కి సూచించారు. తెలంగాణ సెంటిమెంట్‌ని ప్రయోగిస్తూ ప్రతీ అంశాన్ని రాజకీయం చేయొద్దని ఆయన అన్నారు. రేడియల్ కోడ్ కోసం కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. దీని కోసం 80కోట్ల రూపాయలు కూడా కేటాయించిందని ఆయన పేర్కొన్నారు. రేడియల్ కోడ్ కి సంబంధించిన డీపీఆర్ ఢిల్లీకి తీసుకురావాలని ఆయన సూచించారు. దానికి కేంద్ర సహకారం ఉంటుందని ఆయన చెప్పారు.