తెలంగాణలో పోలియో వైరస్... స్పెషల్ వాక్సిన్ డ్రైవ్ కు కేసీఆర్ ఆదేశం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మురికి నీటిలో పోలియో మహమ్మారి కనిపించడాన్ని కేసీఆర్ ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ వైరస్ ఏ ఒక్క చిన్నారికీ సోకరాదని అందుకు తగ్గ చర్యలను వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ఈ నెల 20 నుంచి 26 వరకూ వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్ తివారీ వెల్లడించారు. ఇందులో భాగంగా మూడేళ్లలోపు చిన్నారులందరికీ పోలియో వాక్సిన్ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ప్రజలు అలక్ష్యం చేయకుండా, తమ చిన్నారులకు వాక్సిన్ ఇప్పించాలని ఆయన సూచించారు.