తీవ్ర నీటి కరవులో దొనకొండ ప్రాంతం... రైళ్లలో నీరు తెచ్చుకుంటున్న ప్రజలు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తీవ్ర నీటి కరవులో దొనకొండ ప్రాంతం... రైళ్లలో నీరు తెచ్చుకుంటున్న ప్రజలు!

ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతం... రెండున్నరేళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ విడిపోతే రాజధానిగా మారుతుందని ప్రచారం జరిగిన ఊరు. ఇప్పుడా ఊరు తీవ్ర నీటి కరవుతో అల్లాడుతోంది. తాగేందుకు గుక్క నీరు దొరకని పరిస్థితుల్లో ప్రజలు రైలెక్కి, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజ్జలకొండ వెళ్లి బిందెల్లో నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతానికి నీరందించే చందవరం వేసవి స్టోరేజ్ ట్యాంక్ పూర్తిగా ఎండిపోవడం, సాగర్ రైట్ కెనాల్ నుంచి నీరు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో గుంటూరు- గుంతకల్ మార్గంలో ప్రయాణించే పాసింజర్ రైళ్లను ప్రజలు నమ్ముకున్నారు. పొద్దున పూట వచ్చే కాచిగూడ పాసింజర్, తెనాలి - మార్కాపురం రైళ్లు ఎక్కి, ప్లాస్టిక్ బిందెలను వెంట తీసుకువెళ్లి, నీళ్లు తెచ్చుకుని వాడుకుంటున్నారు. గత మూడు వారాలుగా ఇదే పరిస్థితి నెలకొందని, అధికారులు ఇప్పటికైనా స్పందించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

More Telugu News