Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

టీఆర్ఎస్ లోకి మాజీ ఎంపీ వివేక్, వినోద్...ముహూర్తం ఖరారు?

గతంలో వచ్చిన రూమర్లు త్వరలో వాస్తవ రూపం దాల్చనున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ చేతిలో ఘోరపరాజయం చవిచూసిన మాజీ ఎంపీ వివేక్‌ పార్టీ మారనున్నారని గతంలో వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆ వార్తలు ఇప్పుడు వాస్తవరూపం దాల్చనున్నాయి. మాజీ ఎంపీ వివేక్ తో పాటు మాజీ మంత్రి వినోద్‌ ఈనెల 15న సీఎం కేసీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ ఇద్దరితో పాటు కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ముఖ్య నేతలు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నారు. వారే కాకుండా, అదే జిల్లా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్‌ నేతలు జువ్వాడి నర్సింగరావు, రాజు తదితరులు కూడా టీఆర్ఎస్ లో చేరనున్నారు.

More Telugu News