ద్వారకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి లగ్జరీ బస్సుపై లక్షలాది రూపాయల రోడ్డు పన్నును మధ్యప్రదేశ్ ప్రభుత్వం మినహాయించింది. ఈ మేరకు ఈరోజు ఒక ప్రకటన విడుదల చేసింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. స్వామి వారి లగ్జరీ బస్సుకు సుమారు రూ.11 లక్షల రోడ్డు పన్నును మినహాయింపు ఇచ్చామని ఈ సందర్భంగా అధికారులు తెలిపారు.
ఈ లగ్జరీ బస్సు వాస్తవ ఖరీదు రూ.15 లక్షలు. అయితే, ఇందులో వాష్ రూమ్, లిఫ్ట్, బెడ్ తదితర వసతులు ఏర్పాటు చేశారు. దీంతో, ఈ ఖర్చులు కూడా కలుపుకుని మొత్తం ఖరీదు రూ.1.30 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా, ఈ బస్సును గత ఏడాది కొనుగోలు చేశారు. ఈ బస్సుపై పన్నును రద్దు చేయాలని రోడ్లు, భవనాల శాఖను స్వామి వారి శిష్యులు కోరారు. సదరు శాఖ అందుకు నిరాకరించడంతో, హోం శాఖ మంత్రి బాబులాల్ గౌర్ ను వారు కలవడంతో పని చక్కబడింది.
ఇటీవల ఉజ్జయినిలో సింహస్త కుంభమేళా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ కుంభమేళా నిర్వహణకు గాను శంకరాచార్య పీఠం నుంచి సాయం కావాలని రవాణా శాఖ మంత్రి భూపేంద్ర సింగ్ కోరడం, అందుకు ఆ పీఠం సహకరించడం జరిగింది. ఇందుకు ప్రతిఫలంగానే స్వామి వారి బస్సుకు రోడ్డు పన్నును రద్దు చేసినట్లు సమాచారం.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన