ఆకాశానికి టొమాటో ధర... హైదరాబాద్ లో కిలో రూ. 80
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆకాశానికి టొమాటో ధర... హైదరాబాద్ లో కిలో రూ. 80

రబీలో టొమాటో పంట దిగుబడి గణనీయంగా పడిపోవడంతో బహిరంగ మార్కెట్ ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు వారాల క్రితం కిలో రూ. 25 నుంచి రూ. 30 వరకూ ఉన్న ధర, ఇప్పుడు రూ. 80కి చేరుకుని పేద, మధ్యతరగతికి భారంగా పరిణమించింది. నేడు మార్కెట్ కు వచ్చిన 25 కేజీల బాక్స్ ధర టోకుగా రూ. 1200 పలికింది. అంటే కిలో రూ. 48 పలికినట్టు. ఇక అక్కడి నుంచి చిరు వ్యాపారులు, తోపుడుబండ్ల వారికి రూ. 65కు లభిస్తుండటంతో, ప్రజల వద్దకు వచ్చే సరికి ధర ఏకంగా రూ. 80 పలుకుతోంది. మరో వారంలో టొమాటో ధర సెంచరీని దాటుతుందని అంచనా.

More Telugu News