కేంద్రం అండతో విర్రవీగొద్దు!... వివాదంతో ఏపీకే నష్టం!: తుమ్మల ఘాటు వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్రం అండతో విర్రవీగొద్దు!... వివాదంతో ఏపీకే నష్టం!: తుమ్మల ఘాటు వ్యాఖ్యలు

రాష్ట్ర విభజన తర్వాత తెలుగు రాష్ట్రాలు ఏపీ, తెలంగాణల మధ్య జల జగడాలు నానాటికీ ముదురుతున్నాయి. ప్రధానంగా పాలమూరు జిల్లా పరిధిలో తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిపై నిర్మించతలపెట్టిన పాలమూరు- రంగారెడ్ది, డిండి ప్రాజెక్టులు ఈ జగడాలకు మరింత ఆజ్యం పోశాయి. ఈ క్రమంలో నిన్న టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిన్న హైదరాబాదులోని టీఆర్ఎస్ భవన్ వేదికగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తుమ్మల చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కేంద్రం అండగా ఉందని ఏపీ సర్కారు విర్రవీగుతోందని ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘మీ రాష్ట్రంలో జరిగే రాజకీయాల కోసం తెలంగాణను ఇబ్బందుల పాలు చేయొద్దు. దాని వల్ల మీరే నష్టపోతారు. మీ చిల్లర రాజకీయాలకు మా ప్రాజెక్టులను ఆపబోం’’ అని తుమ్మల కాస్తంత ఘాటు వ్యాఖ్యలే చేశారు.

More Telugu News