కాంగ్రెస్ నేతలను అడవి పందులతో పోల్చిన చంద్రబాబు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాంగ్రెస్ నేతలను అడవి పందులతో పోల్చిన చంద్రబాబు!

గత పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ నేతలను అడవి పందులతో చంద్రబాబునాయుడు పోల్చారు. విజయవాడలో నవనిర్మాణ దీక్షను పురస్కరించుకుని ఓ టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, ఓ చక్కని పంటపొలంలో అడవి పందులు పడి ధ్వంసం చేసినట్టు, గత పదేళ్లు అధికారంలో ఉన్న వారు ఈ రాష్ట్రాన్ని నాశనం చేశారని అన్నారు. దానిని చక్కదిద్దడానికి తాను చెమటోడ్చుతున్నానని ఆయన చెప్పారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని నాశనం, ముక్కలు చేసిన వారే ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లి కల్లబొల్లి మాటలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తన దగ్గర వారి ఆటలు సాగవని, అతి చేసిన వారి తోకలు కట్ చేస్తానని ఆయన చెప్పారు.

More Telugu News