‘హోదా’ దీక్ష భగ్నం... చలసానిని ఆసుపత్రికి తరలించిన ‘అనంత’ ఖాకీలు
ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ‘ప్రత్యేక హోదా సాధన సమితి’ అనంతపురంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. నిన్న ప్రారంభమైన ఈ దీక్షలో కూర్చున్న సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆరోగ్యం క్షీణించింది. రెండు రోజులుగా ఆహారం తీసుకోకుండా దీక్ష చేస్తున్న చలసాని షుగర్ లెవెల్స్ పడిపోయాయి. బీపీ కూడా తగ్గింది. ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న వైద్యుల సూచనతో రంగప్రవేశం చేసిన పోలీసులు చలసానిని బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా పోలీసులను అడ్డుకునేందుకు నిరసనకారులు శతథా యత్నించారు. దీంతో అక్కడ ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. నిరసనకారులను పక్కకు లాగేసిన పోలీసులు చలసానిని కారెక్కించి ఆసుపత్రికి తరలించారు.