విలువలకు కట్టుబడ్డ నేత చెన్నమనేని!.. తెలంగాణ నేత మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విలువలకు కట్టుబడ్డ నేత చెన్నమనేని!.. తెలంగాణ నేత మృతి పట్ల వైఎస్ జగన్ సంతాపం

సీనియర్ రాజకీయవేత్త, ఆరుసార్లు ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ జిల్లా సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు మృతి పట్ల వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నమనేని మరణ వార్తను తెలుసుకున్న వెంటనే కొద్దిసేపటి క్రితం జగన్... తన సంతాపాన్ని ప్రకటిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. విలువలకు కట్టుబడ్డ వ్యక్తిగా చెన్నమనేనిని జగన్ అభివర్ణించారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో మచ్చలేని నేతగా చెన్నమనేని రాణించారని ఈ సందర్భంగా జగన్ నివాళులర్పించారు.

More Telugu News