సోనియా, రాహుల్ గాంధీల అరెస్ట్...ఉద్రిక్తత... విడుదల
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సోనియా, రాహుల్ గాంధీల అరెస్ట్...ఉద్రిక్తత... విడుదల

దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 'సేవ్ డెమోక్రసీ' మార్చ్ ఉద్రిక్తంగా మారింది. జంతర్ మంతర్ నుంచి పార్లమెంటు వరకు జరపతలపెట్టిన ఈ మార్చ్ పార్లమెంటు స్ట్రీట్ లోకి చేరగానే పోలీసులు రంగప్రవేశం చేసి, ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను అదుపులోకి తీసుకున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ గేట్లు, కాంపౌండ్ వాల్ ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేసిన వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని వారు ప్రశ్నించారు. కాగా, కాసేపటికి సోనియా, రాహుల్ తదితర నేతలను పోలీసులు విడుదల చేశారు.

More Telugu News