హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు: వైఎస్సార్సీపీ
ఎమ్మెల్యే రోజాపై హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబు సర్కార్ కి చెంప పెట్టని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన అన్నారు. ఏపీ శాసనసభ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. లేనిపోని ఆరోపణలతో, కావాలనే ఆమెను సస్పెండ్ చేశారన్నారు. మళ్లీ అసెంబ్లీకి రోజా వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారని కల్పన అన్నారు.