ఓవైసీ బ్రదర్స్ కు షాకిచ్చిన ‘మహా’ అసెంబ్లీ... మజ్లిస్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన వైనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓవైసీ బ్రదర్స్ కు షాకిచ్చిన ‘మహా’ అసెంబ్లీ... మజ్లిస్ ఎమ్మెల్యేను సస్పెండ్ చేసిన వైనం

పీకపై కత్తి పెట్టినా ‘భారత్ మాతా కీ జై’ అననంటూ మజ్లిస్ అధినేత, హైదరాబాదు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెర తీశాయి. తమ పార్టీ అధినేత వైఖరికి భిన్నంగా తానెలా ‘భారత్ మాతా కీ జై’ అంటానంటూ వ్యాఖ్యానించిన మహారాష్ట్రకు చెందిన మజ్లిస్ ఎమ్మెల్యే వారిస్ పఠాన్ పై ఆ రాష్ట్ర అసెంబ్లీ నిన్న సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం మహారాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో నిన్న సభలో ‘భారత్ మాతా కీ జై’ అనాలని బీజేపీ ఎమ్మెల్యే రామ్ కదమ్... వారిస్ పఠాన్ ను డిమాండ్ చేశారు. అందుకు పఠాన్ ససేమిరా అన్నారు. దీంతో బీజేపీ సభ్యుడికి మద్దతుగా అన్ని పార్టీల ఎమ్మెల్యేలు పఠాన్ పై ఒత్తిడి తెచ్చారు. అయినా పఠాన్ దిగిరాలేదు. దీంతో సభావ్యవహారాల శాఖ మంత్రి రనిత్ పాటిల్... పఠాన్ ను సస్పెండ్ చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో పఠాన్ ను స్పీకర్... బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేశారు. దీనిపై స్పందించిన అసదుద్దీన్ ఓవైసీ... పఠాన్ ను సస్పెండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టేనని వ్యాఖ్యానించారు.

More Telugu News