'తల్లిదండ్రులు కోరుకోని బిడ్డను' అన్న కంగనా రౌనత్ వ్యాఖ్యలపై తండ్రి బాధ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'తల్లిదండ్రులు కోరుకోని బిడ్డను' అన్న కంగనా రౌనత్ వ్యాఖ్యలపై తండ్రి బాధ!

తన తల్లిదండ్రులు 'కోరుకోని బిడ్డ'గా తాను జన్మించానని బాలీవుడ్ నటి కంగనా రౌనత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించగా, వాటిపై ఆమె తండ్రి అమర్ దీప్ రౌనత్ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ లో ఉంటున్న ఆయన కంగనా వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, "ఆమె పుట్టిన సమయంలో మా గ్రామంలో పరిస్థితి అలాంటిది. ఆడపిల్ల పుట్టిందంటే సంబరాలు చేసుకునే స్థితి లేదు. ఆడపిల్ల జన్మ అంటే చావు కన్నా పెద్ద బాధ కిందే లెక్క. ఊళ్లో వాళ్లంతా వచ్చి ఆడపిల్లా? అని పెదవి విరిచి వెళ్లేవారు. అందుకే బిడ్డ పుట్టిందన్న ఆనందం లేదు. మేమేమీ మిఠాయిలు పంచుకోలేదు. అప్పటికే మాకు ఓ మగబిడ్డ పుట్టి చనిపోయాడు. ఆనాటి మా పరిస్థితి అటువంటిది" అని తెలిపాడు. కాగా, ఇదే విషయమై ఆమె సోదరి రంగోలీ మాట్లాడుతూ, "కంగనా పుట్టిన రోజు నాకింకా గుర్తుంది. ఆనందం లేదు, ఉత్సాహం లేదు. బంధువులు ఇంటికి వచ్చి బిడ్డ అక్కర్లేదని కూడా అన్నారు. మేం పుట్టిన ఊరు ఇప్పటికీ మారలేదు. బాలికల పట్ల అక్కడ ఇంకా ఇదే స్థితి. కంగనా పెరుగుతున్న కొద్దీ, తన మనసులో బాలికలపై చూపుతున్న వివక్ష ప్రభావం బలంగా నాటుకుపోయింది" అని అన్నారు.

More Telugu News