అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం... పిట్స్ బర్గ్ కాల్పుల్లో ఐదుగురి మృతి

10-03-2016 Thu 13:17 | International
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలకు తెర పడటం లేదు. ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్న ఈ తరహా ఘటనలు ఆ దేశ ప్రజలతో పాటు ప్రభుత్వాన్ని హడలెత్తిస్తున్నాయి. తాజాగా పిట్స్ బర్గ్ లో నిన్న (భారత కాలమానం ప్రకారం నేటి ఉదయం) ఆయుధాలు చేతబట్టి రంగంలోకి దిగిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. పిట్స్ బర్గ్ కు 13 కిలో మీటర్ల దూరంలోని విల్కిన్స్ బర్గ్ లో చోటుచేసుకున్న ఈ కాల్పుల్లో ఐదుగురు మరణించారు. పెద్ద సంఖ్యలో పౌరులు గాయపడ్డట్లు సమాచారం. మరణించిన వారిలో నలుగురు మహిళలు సహా ఓ చిన్నారి ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. ఇద్దరు గన్ మెన్లు కాల్పులు జరిపారని ప్రత్యక్ష సాక్షులు చెప్పగా, దుండగుల సంఖ్య ఏడు నుంచి ఎనిమిది మంది దాకా ఉండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. కాల్పులు జరిపిన దుండగులకు సంబంధించిన వివరాలేమీ తెలియరాలేదు.

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more