తమిళనాడులోని మధురై జిల్లాలో ఘోరం జరిగిపోయింది. శ్రీలంకలో ఉద్రిక్తతల నేపథ్యంలో చాలాకాలం క్రితం తమిళనాడు చేరుకుని శరణార్థిగా దుర్భర జీవితం గడుపుతున్న ఓ వ్యక్తి జనం చూస్తుండగానే హైటెన్షన్ విద్యుత్ స్తంభం ఎక్కి కాలితో విద్యుత్ వైర్ ను టచ్ చేసి మంటల్లో దహనమైపోయాడు. కింద అతడి బంధువులు, వందలాది మంది శరణార్థులు హాహాకారాలు చేస్తుండగా... స్తంభంపైకి ఎక్కిన బాధితుడు నమస్కారం పెట్టి... ఆపై కాలితో విద్యుత్ వైరును తాకడంతో.. వెనువెంటనే పెద్ద శబ్దంతో ఎగసిన మంటల్లో అతడు సజీవ దహనం కావడం అక్కడ కలకలం రేపింది. ఆత్మహత్యాయత్నాన్ని విరమించాలని కింద నుంచి బంధువులు చేస్తున్న విజ్ఞప్తిని అతడు ఏమాత్రం అంగీకరించలేదు. ఆత్మబలిదానం మినహా తనకు మరో మార్గం లేదంటూ అతడు విద్యుత్ మంటలకు దహనమైపోయాడు.
శరణార్థులకు సహాయమందిస్తున్న ఓ స్థానిక అధికారి వేధింపుల కారణంగానే అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. బాధితుడి ఆత్మహత్యతో శరణార్థులు ఒక్కసారిగా ఆగ్రహావేశాలకు లోనయ్యారు. అక్కడే ఉన్న వేధింపుల అధికారిపై మూకుమ్మడి దాడి చేశారు. ఈ దాడిలో సదరు అధికారికి తీవ్ర గాయాలయ్యాయి. వెనువెంటనే స్పందించిన జిల్లా ఎస్పీ స్వయంగా రంగంలోకి దిగి గాయపడ్డ అధికారిని ఆసుపత్రికి తరలించారు. భారీ ఎత్తున పోలీసు బలగాలను రంగంలోకి దించి పరిస్థితిని అదుపు చేశారు. బాధితుడి ఆత్మహత్యకు సంబంధించిన వీడియో ఫుటేజీలను దేశవ్యాప్తంగా అన్ని న్యూస్ చానెళ్లు ప్రముఖంగా ప్రసారం చేశాయి.
More Telugu News
-
గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు
-
"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ
-
భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!
-
ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్
-
'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి
-
ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు
-
వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు
-
పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్
-
సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు
-
షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ
-
పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
-
ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!
-
బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
-
అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు
-
బలహీనమైన మగాడి సంతోషం కోసం మరో మహిళను అణచివేయొద్దు: ఉపాసన