అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు... కోహ్లీకి 30 శాతం జరిమానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అంపైర్ నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు... కోహ్లీకి 30 శాతం జరిమానా

టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. ఆసియా కప్ లో భాగంగా పాకిస్థాన్ తో జరిగిన టీట్వంటీ మ్యాచ్ లో 49 పరుగుల వద్ద కోహ్లీ ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరిన సంగతి తెలిసిందే. అంపైర్ నిర్ణయం ప్రకటించిన వెంటనే కోహ్లీ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. క్రీజులో నుంచే ఈ నిర్ణయాన్ని ప్రశ్నించాడు. అలాగే క్రీజులోంచి పెవిలియన్ చేరుతుండగా అంపైర్ పై కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు కూడా చేశాడని రిఫరీ నిర్ణయించారు. దీంతో క్రమశిక్షణ చర్యల కింద కోహ్లీ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించినట్టు తెలిపారు. కాగా, ఈ మ్యాచ్ లో కోహ్లీ రాణించడంతో టీమిండియా సునాయాసంగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

More Telugu News