కొడంగల్ లో ఎంపీడీవోపై ఉపాధిహామీ కూలీల దాడి... ఫర్నీచర్ ధ్వంసం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొడంగల్ లో ఎంపీడీవోపై ఉపాధిహామీ కూలీల దాడి... ఫర్నీచర్ ధ్వంసం

టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్ లో ఉపాధిహామీ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీడీవో వీరబ్రహ్మాచారిపై దాడి చేశారు. ఉపాధిహామీ పనులకు వస్తున్నా రెండు నెలలుగా తమకు కూలీ డబ్బులు మాత్రం ముట్టడంలేదని ఆరోపించారు. ఈ క్రమంలో పర్సాపూర్ గ్రామానికి చెందిన కూలీలు ఈ రోజు ఎంపీడీవోపై దాడికి పాల్పడ్డారు. అంతేగాకుండా కార్యాలయంలోని కుర్చీలు, టేబుళ్లను ధ్వంసం చేశారు. తరువాత కూలీలపై ఎంపీడీవో కొడంగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

More Telugu News