ఫాల్కనర్ స్లెడ్జింగ్ చేసిన వేళ కోహ్లీ చెప్పిన సమాధానం ఇదే!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫాల్కనర్ స్లెడ్జింగ్ చేసిన వేళ కోహ్లీ చెప్పిన సమాధానం ఇదే!

ఆస్ట్రేలియాతో మ్యాచ్ జరుగుతున్న వేళ, కోహ్లీ విరుచుకుపడుతుంటే, అతని ఏకాగ్రతను దెబ్బతీసేందుకు ఫాల్కనర్ స్లెడ్జింగ్ కు దిగగా, దానికి జవాబేదో చెప్పిన విరాట్ కోహ్లీ, తరువాతి బంతికి సిక్స్ కొట్టిన సంగతి తెలిసిందే. అసలు మైదానంలో వీరిద్దరి మధ్యా జరిగిన సంభాషణ ఏంటన్నది ఇప్పుడు బయటకు వచ్చింది. తనను ఎవరైనా ఏదైనా అంటే వెంటనే స్పందించే గుణమున్న కోహ్లీ ఈ దఫా కూడా అలాగే చేశాడు. ఫాల్కనర్ వేస్తున్న బంతులను కోహ్లీ డిఫెన్స్ ఆడుతుండగా, "నా బంతులను ఎందుకు ఆడటం లేదు?" అని ప్రశ్నించగా, "ఇప్పటికే నా జీవితంలో నిన్ను (బంతులను) బాదేశాను. నీ శక్తిని వృథా చేసుకోవద్దు. వెళ్లి బౌలింగ్ చెయ్యి" అని అన్నాడట. ఆ తరువాతి బంతిని సిక్స్ కొట్టి, తానెలా ఆడగలనన్న విషయాన్ని కోహ్లీ చూపాడనుకోండి. ఇక ఈ మ్యాచ్ లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 7 వేల పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.

More Telugu News