దేశవ్యాప్తంగా పలు రైళ్ల వేళల్లో మార్పులు... 30 రైళ్లు రద్దు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశవ్యాప్తంగా పలు రైళ్ల వేళల్లో మార్పులు... 30 రైళ్లు రద్దు

భారతీయ రైల్వే శాఖ పలు రైళ్ల వేళల్లో మార్పులు చేసింది. అననుకూల వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని రైళ్లను పూర్తిగాను, మరికొన్నింటిని పాక్షికంగాను రద్దు చేసింది. దేశవ్యాప్తంగా పొగమంచు కురుస్తుండటంతో రైళ్ల సేవలను అందించడంలో అంతరాయం ఏర్పడుతోందని తెలిపింది. విపరీతమైన మంచు కారణంగా రైళ్ల రాకపోకలను నియంత్రించక తప్పలేదని రైల్వేశాఖ ప్రకటించింది. ఈ నెల 8 నుంచి ఫిబ్రవరి 29 వరకు ఈ మార్పులు అమల్లో ఉంటాయని, ప్రయాణికులు గమనించాలని కోరింది. దానికి సంబంధించి రైల్వే వెబ్ సైట్ ఐఆర్ సీటీసీలో ఈ జాబితాను ప్రకటించింది. దాదాపు 30 రైళ్లను రద్దు చేయగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. మరో నాలుగు రైళ్లకు సంబంధించిన రెగ్యులర్ రూట్లను డైవర్ట్ చేసింది. 482 రైళ్లకు సంబంధించి కొన్ని రైళ్ల రూట్ల డైవర్షన్, ఫ్రీక్వెన్సీ తగ్గింపులాంటి మార్పులు చేర్పులు చేసినట్టు తెలిపింది.

More Telugu News