శంషాబాద్ విమానాశ్రయంలో 2.5 కేజీల బంగారం స్వాధీనం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శంషాబాద్ విమానాశ్రయంలో 2.5 కేజీల బంగారం స్వాధీనం

విదేశాల నుంచి భారీ ఎత్తున బంగారం తెస్తూ ఓ వ్యక్తి పట్టుబడడం హైదరాబాదు శంషాబాదులోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కలకలం రేపింది. దుబాయ్ నుంచి వచ్చిన విదేశీయుడ్ని తనిఖీలు చేసిన సందర్భంగా అతని వద్ద రెండున్నర కేజీల బంగారం ఉన్నట్టు డీఆర్ఐ సిబ్బంది గుర్తించారు. దీంతో దానిని ఆయన నుంచి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు దుబాయ్ నుంచి హైదరాబాదు మీదుగా విశాఖపట్టణానికి ఈ బంగారం తరలిస్తున్నట్టు అధికారులు విచారణలో కనుగొన్నారు. దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News