విజయవాడ స్వర్ణ బార్ లైసెన్సును రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విజయవాడ స్వర్ణ బార్ లైసెన్సును రద్దు చేసిన ఎక్సైజ్ శాఖ

విజయవాడ కల్తీ మద్యం కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కృష్ణలంకలో ఉన్న స్వర్ణ బార్ లైసెన్సును ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. బార్ లోని మద్యం కల్తీ అవడం వల్లే పలువురు పేదలు చనిపోయారంటూ ఇవాళ ఎక్సైజ్ శాఖ కమిషనర్ సమర్పించిన నివేదికలో వెల్లడించడంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. మరోవైపు ఈ వ్యవహారంలో విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్వీ రమణపై సస్పెన్షన్ వేటు పడింది. స్వర్ణ బార్ కు లైసెన్స్ మంజూరులో నిబంధనలు పాటించలేదని ఆయనపై చర్యలు తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.

More Telugu News