ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ పై ఉదయ్ పూర్ లో కేసు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్ పై ఉదయ్ పూర్ లో కేసు

ఢిల్లీ యూనివర్శిటీ ఫిలాసఫీ మాజీ ప్రొఫెసర్ అశోక్ వోహ్రాపై రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ లాల్ శుక్లా యూనివర్శిటీలో 'రెలీజియస్ డైలాగ్' అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో వోహ్రా ప్రసంగించారు. ఈ సందర్భంగా హిందూ దేవతలపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే ఈ వ్యాఖ్యలపై ఏబీవీపీ కార్యకర్త దేవేంద్ర సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఓ మతాన్ని కించపరిచినందుకు గాను సెక్షన్ 295, ఇరువర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రేరేపించే చర్యకు పాల్పడినందుకు సెక్షన్ 153(ఎ) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే సదరు ప్రొఫెసర్ మాత్రం తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని అంటున్నారు. కొంతమంది విదేశీయుల అభిప్రాయాలను మాత్రమే తాను వెల్లడించానని, తన ప్రసంగానికి సంబంధించిన అంశాలను పరిశీలించడానికి ఓ ప్యానల్ ను నియమించాలని సీఎం వసుంధర రాజేకు ఆయన లేఖ రాశారు.

More Telugu News