రైళ్లలో హాఫ్ టికెట్ కు చెల్లుచీటి!... వచ్చే ఏడాది నుంచి అమలుకు నిర్ణయం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రైళ్లలో హాఫ్ టికెట్ కు చెల్లుచీటి!... వచ్చే ఏడాది నుంచి అమలుకు నిర్ణయం

సెలవులు వచ్చాయంటే దేశంలోని రైళ్లన్నీ కిటకిటలాడుతుంటాయి. ఎందుకంటే, రైలు ప్రయాణాన్ని మించిన సుఖమయ ప్రయాణం మరొకటి ఉండదు. సరే, మరి పిల్లా పాపలతో రైలు ప్రయాణం చేసేవారు వచ్చే ఏడాది నుంచి మరింత రుసుము చెల్లించక తప్పదట. ఎందుకంటే, ఐదేళ్ల నుంచి 12 లోపు పిల్లలకు ఇప్పటిదాకా హాఫ్ టికెట్ కొంటే సరిపోతుంది. ఐదేళ్ల లోపు పిల్లలకు అసలు టికెట్ తీయాల్సిన అవసరమే లేదు. వచ్చే ఏడాది నుంచి ఈ హాఫ్ టికెట్ అందుబాటులో ఉండదట. అంటే, 5-12 ఏళ్ల లోపు చిన్న పిల్లలకు కూడా ఫుల్ టికెట్ తీసుకోవాల్సిందే. అయితే చిన్న పిల్లలకు కూడా బెర్త్, సీటు రిజర్వ్ చేసుకోవాలనుకునే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని రైల్వే శాఖ చెబుతోంది. సీటు, బెర్తు అవసరం లేకుండానే ప్రయాణించే చిన్న పిల్లలకు హాఫ్ టికెట్ కొంటే సరిపోతుందని ఆ శాఖ అధికారులు రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు.

More Telugu News