Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఏపీ పాఠశాల విద్యలో సంస్కరణల అమలుపై కమిటీ... సభ్యులుగా చాగంటి, బీవీ పట్టాభిరామ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాల విద్యకు సంబంధించి పలు సంస్కరణలు తీసుకువచ్చేందుకు, ఇతర ప్రణాళికల అమలుకు సర్కార్ చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో నిపుణులతో ఒక సలహా సంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విద్యాశాఖ మంత్రి అధ్యక్షతన ఈ సలహా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ సలహా సంఘానికి పాఠశాల విద్య కమిషనర్ సభ్య కార్యదర్శిగా ఉంటారు. సలహా సంఘం సభ్యులుగా ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు, ప్రఖ్యాత హిప్నాటిస్ట్ బీవీ పట్టాభిరామ్, ఎన్.వి.వర్లు, శాంతా బయోటెక్ ఎండీ కెఐ వరప్రసాద్ రెడ్డి ఉన్నారు.

More Telugu News