ఐఎస్ఐ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న ఆర్మీ జవాను అరెస్ట్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఐఎస్ఐ ఏజెంట్ గా వ్యవహరిస్తున్న ఆర్మీ జవాను అరెస్ట్!

భారత సైన్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందుతుంటారు. అలాంటి ఆర్మీలో చీడ పురుగులు ప్రవేశించాయి. మన డిఫెన్స్ కి సంబంధించిన రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరుస్తున్న ఆర్మీ జవానును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశ భద్రతకు భంగం కలిగిస్తూ, సీక్రెట్ అంశాలను పాకిస్థాన్ కు చేరవేస్తున్న ఐఎస్ఐ ఏజెంట్లను ఏరివేసేందుకు ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు నిర్వహిస్తున్న ఆపరేషన్ లో సంచలనాత్మక విషయాలు వెల్లడవుతున్నాయి. పాకిస్థాన్ కు చెందిన ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐకు ఏజెంట్లుగా ఉంటూ ఇండియన్ ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో నిన్న కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికుడిని అదుపులోకి తీసుకోగా, నేడు సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్న పశ్చిమబెంగాల్ జవానును అదుపులోకి తీసుకున్నారు. సిలిగురిలో ఆర్మీ జవానుగా పని చేస్తున్న ఫరీద్ ఖాన్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు తెలిపారు. ఫరీద్ భారత్ కు చెందిన కీలక రహస్యాలను పొరుగు దేశానికి చేరవేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఈ దాడుల్లో ఇప్పటి వరకు ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఓ ప్రభుత్వోద్యోగి, కార్గిల్ లో పాల్గొన్న మాజీ సైనికుడు కూడా ఉన్నారు. నిన్న అరెస్టు చేసిన ప్రభుత్వోద్యోగిని నేడు అరెస్టైన ఫరీద్ చాలాసార్లు కలిసినట్టు...ఆయనతో చాలా సార్లు ఫోన్లో మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.

More Telugu News