Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోహ్లీ హాఫ్ సెంచరీ... భారీ ఆధిక్యం దిశగా భారత్

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న చివరి టెస్టును శాసించే స్థితికి టీమిండియా చేరుకుంది. ప్రస్తుతానికి నాలుగు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసిన భారత్... మొత్తం మీద 357 పరుగుల ఆధిక్యతను సాధించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ 8 ఫోర్ల సాయంతో 62 పరుగులతో ఆడుతున్నాడు. అతనికి అండగా రహానే (27) సమయోచితంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరి భాగస్వామ్యాన్ని విడదీయడానికి సఫారీ బౌలర్లు చెమటోడుస్తున్నప్పటికీ సఫలం కాలేకపోతున్నారు. 400 పరుగుల ఆధిక్యత సాధించిన అనంతరం భారత్ డిక్లేర్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి.

More Telugu News