Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఫేస్ బుక్, వాట్స్ యాప్ లను నిషేధించలేమన్న సుప్రీంకోర్టు

ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్ బుక్, వాట్స్ యాప్ లపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. వాటిని నిషేధించడం ఆచరణ సాధ్యం కాదని జస్టిస్ మదన్ బీ లోకూర్, జస్టిస్ లలిత్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. అయితే అభ్యంతరకర, అసభ్యకర సమాచారం వ్యాప్తి కాకుండా నిరోధించడంలో ఈ వెబ్ సైట్లు విఫలమైతే వాటిపై విచారణ జరిపే అవకాశం ఉందా? అని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీం ప్రశ్నించింది. ఈ విషయాన్ని పరిశీలించాలని ఆదేశించింది. ముంబైలో వాట్స్ యాప్ ద్వారా అత్యాచార వీడియోల్ని వ్యాప్తి చేయడం, ఫేస్ బుక్ ఖాతా ద్వారా సెక్స్ రాకెట్ ను నిర్వహిస్తూ చిన్నారులను ఆకర్షించడం వంటి ఘటనలు వెలుగులోకి వచ్చినా వాటిని తొలగించేందుకు ఆ వెబ్ సైట్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదని రెండు కేసులు న్యాయస్థానం దృష్టికి వచ్చాయి. ఈ మేరకు 'ప్రజ్వల' సంస్థ చీఫ్ సునీతా కృష్ణన్ పై పిటిషన్ దాఖలు చేశారు.

More Telugu News