తలచుకుంటే ఉగ్రవాదులు ఏమైనా చేస్తారు... సైన్యమంతా కలిసినా అడ్డుకోలేరన్న ఫరూక్ అబ్దుల్లా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తలచుకుంటే ఉగ్రవాదులు ఏమైనా చేస్తారు... సైన్యమంతా కలిసినా అడ్డుకోలేరన్న ఫరూక్ అబ్దుల్లా

జమ్మూకాశ్మీర్ లోని ఉగ్రవాదులు తలచుకుంటే ఏమైనా చేయగలుగుతారని, భారత సైన్యమంతా కలసినా వారిని అడ్డుకోలేరని మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. వారు నిర్ణయించుకుంటే, తనతో సహా ఎవరినైనా హత్య చేయగలుగుతారని, సైనికులను అందరినీ తెచ్చి మోహరించినా వారిని ఆపలేరని అన్నారు. పాక్ ఆక్రమిత కాశ్మీరును ఆ దేశానికే వదిలేయాలంటూ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఫరూక్ మరో మారు వేడిని రగిల్చారు. పౌర సమాజ సభ్యులు ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, సమస్యలను ఇరు దేశాలూ చర్చలు జరపడం ద్వారానే పరిష్కరించుకోవాల్సి వుందని అభిప్రాయపడ్డారు. రెండు దేశాలూ యుద్ధం చేసినా పీఓకేను భారత్, ప్రస్తుత జమ్మూకాశ్మీర్ ను పాకిస్థాన్ పొందలేవని తేల్చి చెప్పారు.

More Telugu News