మేం వచ్చాకే ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంది: మోదీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మేం వచ్చాకే ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంది: మోదీ

ఎన్డీయే అధికారంలోకి వచ్చాకే ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. జీడీపీ, ఎఫ్ డీఐలలో పెరుగుదల నమోదైందని, ద్రవ్యోల్బణం, సీఏడీలో తగ్గుదల కనిపిస్తోందని తెలిపారు. అయితే ఆదాయం పెరిగిందని, వడ్డీరేట్లు తగ్గాయని, రూపాయి స్థిరంగా ఉందని ప్రధాని తెలిపారు. ఇక ఆర్థిక సంస్కరణలనేవి స్వల్పకాలికంగా కాకుండా దీర్ఘకాలం కొనసాగుతాయని స్పష్టం చేశారు. సంస్కరణలతో ప్రత్యేకంగా పేదలకు మేలు జరుగుతుందన్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఢిల్లీ ఆర్థిక సదస్సు-2015ను ప్రధాని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జామ్ (జన్ ధన్, ఆధార్, మొబైల్) విజన్ లక్ష్యాన్ని చేరుకున్నామని చెప్పారు. జన్ ధన్ కింద బ్యాంకుల్లో రూ.26 వేల కోట్లు జమయ్యాయని ఆయన వెల్లడించారు. 17 నెలల తమ పాలనలో 190 మిలియన్ల మందిని బ్యాంకింగ్ రంగానికి పరిచయం చేశామని చెప్పుకొచ్చారు.

More Telugu News