రచయితలు, శాస్త్రవేత్తలకు అవార్డులు ఇచ్చి తప్పు చేశామనిపిస్తోంది: కిషన్ రెడ్డి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రచయితలు, శాస్త్రవేత్తలకు అవార్డులు ఇచ్చి తప్పు చేశామనిపిస్తోంది: కిషన్ రెడ్డి

దేశంలో పలువురు రచయితలు, శాస్త్రవేత్తలు, మేధావులు అవార్డులు వెనక్కిచ్చివేయడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడుతున్నారు. వారు అవార్డులు తిరిగిచ్చివేయడం శోచనీయమన్నారు. వాళ్లకు అవార్డులు ఇచ్చి తప్పు చేశామనిస్తోందని మండిపడ్డారు. ఈ మేరకు హైదరాబాద్ లో విలేకరులతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలో ఎమర్జెన్సీ సమయంలో, సిక్కులను ఊచకోత కోసినప్పుడు మేధావులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి సహించలేకపోతున్నారని, స్వార్థం కోసం ప్రజలను విభజించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.

More Telugu News