కేంద్ర మంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కేంద్ర మంత్రి సుజనాకు హైకోర్టు నోటీసులు

కేంద్ర మంత్రి సుజనా చౌదరికి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు నోటీసులిచ్చింది. మారిషస్ కమర్షియల్ బ్యాంకు బకాయిల చెల్లింపులో సుజనా చౌదరి సహా ఆరుగురు డైరెక్టర్లకు కోర్టు ధిక్కారం నోటీసులు జారీ చేసింది. సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మారిషస్ లోని హేస్టియా అనుబంధ కంపెనీ. ఆ కంపెనీ మారిషస్ కమర్షియల్ బ్యాంకు నుంచి 106 కోట్ల రూపాయల రుణం తీసుకుంది. ఈ రుణానికి సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ హామీ ఇచ్చింది. అయితే హేస్టియా కంపెనీ తీసుకున్న రుణం తీర్చకపోవడంతో ఆ మొత్తాన్ని సుజనా కంపెనీ చెల్లించాలంటూ ఎంసీబీ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఆ మొత్తాన్ని చెల్లించాలంటూ హైకోర్టు గతంలో సుజనా ఇండస్ట్రీస్ ను ఆదేశించింది. అయితే ఆ మొత్తం చెల్లించకపోవడంతో కోర్టు ధిక్కారం కింద నోటీసులు జారీ చేసింది.

More Telugu News