తోటి ఖైదీలతో గొడవపడ్డ చోటా రాజన్
పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ మాఫియా డాన్ చోటా రాజన్ తన తీరు మార్చుకోలేదు. బాలిలోని డెన్ పసర్ జైల్లో ఉన్న చోటా రాజన్ తోటి ఖైదీలతో గత రాత్రి గొడవపడ్డాడు. దీంతో, స్టేషన్ లోని ప్రత్యేక సెల్ లోకి రాజన్ ను మార్చారు. అయితే, విచారణకు చోటా రాజన్ బాగా సహకరిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మరోవైపు, తన ప్రాణాలకు ముప్పు ఉందని... ఈ నేపథ్యంలో తనకు దౌత్యపరమైన రక్షణ కావాలని రాజన్ కోరినట్టు సమాచారం. బాలిలో తనకు తగినంత రక్షణ కల్పించడం లేదని ఇండోనేషియా పోలీసు అధికారులకు రాజన్ లేఖ రాసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా, తనకు సరైన వైద్యం కూడా అందించడం లేదని తెలిపారు. మరోవైపు, రాజన్ తీవ్ర ఆందోళనలో ఉన్నాడని, సిగరెట్లను బాగా కాలుస్తున్నాడని బాలి పోలీసులు వెల్లడించారు.