ఇకపై ఆటోలకు మీటర్లు తప్పనిసరి!
హైదరాబాద్, సైబరాబాద్ లో ఇకపై ఆటోలకు మీటర్లు తప్పనిసరి కానుంది. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఆటో మీటర్లు అమలవుతున్నాయి. డిసెంబర్ 1 నుంచి జంట పోలీస్ కమిషనరేట్ లలో ఆటో మీటర్లను తప్పనిసరిగా అమలు చేయనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అదనపు సీపీ జితేందర్ మాట్లాడుతూ, ఆటోలకు మీటర్లు లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై జంటనగరాల్లో ఆటో డ్రైవర్లు మీటర్లు లేకుండా వాహనాన్ని నడుపుతామంటే కుదరదన్నారు. కాగా, నగరంలో ఎక్కడి నుంచి బయలుదేరినా, ఎక్కడికి వెళ్లాలన్నా ఆటోడ్రైవర్లు మీటర్లు వేయడం లేదు. ఇష్టానుసారంగా డబ్బు డిమాండ్ చేస్తుండటంతో ప్రయాణికులకు ఏం చేయాలో అర్థం కాక, వాళ్లు డిమాండ్ చేస్తున్నంత ఇవ్వడం తప్పడం లేదు.